Facebook Twitter
కలలుకంటారు

పెళ్ళీడు రాగానే
"యువతీయువకులై"
తీయని కలలు కంటారు
ఒక ఆస్తిపరుడైన భర్త దొరకాలని
ఒక అందమైన భార్య రావాలని

పెళ్లై "భార్యాభర్తలై"
ఒక కొత్త జంటగా
కమ్మని కలలు కంటారు
ఒక చక్కని బాబో
ఒక అందమైన పాపో పుట్టాలని

ఆపై "తల్లిదండ్రులై"
తిరిగి తీయని కలలు కంటారు
కన్నబిడ్డలు అమెరికాలో
ఖరీదైన చదువులు చదవాలని
కంప్యూటర్ ఇంజనీర్లు కావాలని
అందరికన్న ఉన్నతస్థితిలో ఉండాలని

కానీ వారి బాగోగుల గురించి
కన్నబిడ్డలెవరూ కమ్మని కలలు కనరు
వృద్ధులైన తల్లిదండ్రులపై శ్రద్ధతీసుకోరు
కళ్ళకు కనిపించని కారణమొక్కటే...
జన్మనిచ్చిన వారిమీద జాలిలేకపోడం
రక్తసంబంధాలన్నీ రచ్చబండలై పోవడం
వారిపై వున్న నిన్నటిప్రేమ నేడు సన్నగిల్లడం
అన్నిబందాలు అనుబంధాలు ఆవిరైపోవడం
కన్నవారే కనిపించే దైవాలన్న సత్యాన్ని మరవడం