Facebook Twitter
జాగ్రత్త బిడ్డా ! జరా జాగ్రత్త ! 

నీ చుట్టూ,

నీచులున్నారు, నికృష్టులున్నారు,

పరమ మోసగాళ్ళున్నారు,ఎందుకూ పనికిరాని,  

కొరగాని, కొరకరాని కొయ్యలున్నారు.

దుర్మార్గులున్నారు, దుష్టులున్నారు.

రాక్షసులున్నారు, రాబందులున్నారు.

దొంగలున్నారు, దోచుకునేవారున్నారు.

దగాకోరులున్నారు, దమ్మిడికి పనికిరాని,

పరమ వేస్టుగాళ్ళున్నారు,

పైకి తియ్యని మాటలు చెబుతూ,

లోలోపల విషం చిమ్మేవాళ్ళున్నారు,

విమర్శించే వాళ్ళున్నారు.

చిరునవ్వు నవ్వుతూనే,  చితిని పేర్చేవాళ్ళున్నారు.

కోతరాయుళ్ళున్నారు, కొంపలు కూల్చేవాళ్ళున్నారు

కుట్రలు కుతంత్రాలు పన్నేవాళ్ళున్నారు

నవ్వుతూనే లోతుగా గోతులు తీసేవాళ్ళు ,

విశ్వాసంలేని కుక్కలకు, నటించే నక్కలకు,

నీ సొమ్ముతిని నీ రొమ్మును గుద్దే గుంటనక్కలకు 

వీళ్ళే ప్రతిరూపాలు.  

అందుకే, జాగ్రత్త బిడ్డా ! జరా జాగ్రత్త !