Facebook Twitter
ఆడపిల్ల అగ్గిపుల్ల ...

ఖరీదైన సిగరెట్ కొనుక్కుని
స్టైల్ గా నోట్లో పెట్టుకుని
వెరైటీగా వెలిగించుకుని
గుప్పుమంటూ పొగ పీలుస్తూ
రింగులు రింగులుగా
గాలిలోకి వదులుతూ
మైమరచి మైకంగా మరేదో లోకంలో
విహరించే వ్యక్తికి
అనంత తృప్తిని అందించిన
ఆ చార్మినార్ సిగరెట్ ఆరిపోగానే
కాలి బూడిద కాగానే
కాలిబూట్లక్రింద పడి నలిగిపోతుంది
ఔను కాలిపోయిన సిగరెట్...
ఆరిపోయిన అగ్గిపుల్ల...
అందమైన ఆడపిల్ల...ఒక్కటే
అందుకు కారణం....
అవసరం తీరిన వెంటనే అవన్నీ
వీధిలోకి నిర్దాక్షిణ్యంగా విసిరేయబడతాయి.

చచ్చి సాధించేదేమిటి ?
తానిచ్చే సందేశమేమిటి?