మొన్న మా చేతులు పట్టుకుని
మాకు నడక నేర్పిన మానాన్న
నిన్న తన భుజాలపై ఎక్కించుకొని
కొత్తలోకం చూపించిన మానాన్న
మాకు ఎన్నో జీవిత పాఠాలు
నేర్పిన మా "తొలిగురువు" మానాన్న
మా సుందరమైన సుఖవంతమైన
జీవితసౌధాలకు "పునాదిరాయి" మానాన్న
మాకు నైతిక విలువలు నేర్పిన
బంగరు బ్రతుకు దారులు చూపిన
మంచి మనసున్న "మార్గదర్శి" మానాన్న
మకుటం లేని "మహరాజు" మానాన్న
మేము కమ్మనికలలు కంటుంటే ఆ కలలతో
కడుపు నింపుకున్న "నిస్వార్థజీవి" మానాన్న
రెక్కలు విరిగినా "ఎగిరే పక్షి" మానాన్న
బంగారం బ్రతుకు పంటలు పండించే మానాన్న
చక్కని వంటలుచేసి మా ఆకలి మంటలు ఆర్పే అమృతమయియైన"మరో అమ్మే" మానాన్న
మా జీవితదీపాలను వెలిగించి వెలిగించి
నిన్న "ఆరిపోయి దీపం" మానాన్న
నేడు తన మనవడి రూపంలో వెన్నెల
వెలుగులు విరజిమ్ముతూ మా కష్టాల
కారుచీకట్లను తొలిగించే మానాన్న
నిత్యం"ఉదయించే సూర్యుడు"మానాన్న
అందరికి "ఊపిరిపోసే అపర బ్రహ్మ మానాన్న



