నా చూపులు
నా చూపులు నా కళ్ళకి
క్షమాపణ చెబుతున్నాయి
కళ్లు మూసుకుంటే
మనకు చూపు ఎక్కడిది ?
పాపపు ఆలోచనలే
విచ్చుకోకపోతే పాపమెక్కడిది?
కళ్ళు తెరుచుకున్నా
కబోధికి చూపు ఎక్కడిది?
కొంటే చూపులను
కోర చూపులను
ఆశల చూపులను
ఆకలి చూపులను
అల్లరి చూపులను
అమాయకపు చూపులను
అంతర్గత దర్పణంలో
చూస్తేనే అర్థం అయ్యేది
కళ్ళు కామపు చూపులను కంటే
కళ్ళు కామంతో పొరలు కమ్మితే
చూపులే చురకత్తులైతే ఇక కన్నీటి వర్షమే
అంతరంగాన బ్రద్దలయ్యేది అగ్నిపర్వతాలే
చూపులతో ఎందరికో చుట్టరికముంది
చెడు చూపుతో చేదు చూపుతో
కడచూపుతో కన్నీటి చూపుతో
ఎద రగిలిపోతోంది ఆరని మూగవేదనతో
హృదయం కృంగిపోతోంది అధఃపాతాళానికి



