Facebook Twitter
ఎక్కడిది ? ఎక్కడిది ?..

ఎక్కడిదీ ఎక్కడిదీ
మనకు జన్మ ఎక్కడిది?
అమ్మానాన్న లేకపోతే
మనకు జన్మ ఎక్కడిది?

పందెమే లేకపోతే
పతకమంటు ఎక్కడిదీ?
పతకమే లేకపోతె
ప్రశంసలంటెక్కడివీ?

ఆటలే లేకపోతే
పోటీఅంటెక్కడిదీ
పోటీనే లేకపోతే
ఓటమంటు ఎక్కడిదీ?

గురువంటూ లేకపోతే
గ్రంధమంటు ఎక్కడిదీ?
గ్రంధమే లేకపోతే
జ్ఞానమంటు ఎక్కడిదీ?

విద్యయే‌ లేకపోతే
వినయమంటూ ఎక్కడిదీ?
వినయమే లేకపోతే
విజయమంటు ఎక్కడిదీ?