కాలుజారినా
కన్నెగానే కడుపు పండినా
అది ఒక ప్రమాదమే పెనుతుఫానే
అది గండమే సమస్యల సుడిగుండమే
అదొక చేదు జ్ఞాపకమై
గుండెల్లో గునపాలను గుచ్చుతుంది
అదొక మాయని మచ్చై
కొంపలో కుంపటిలా మంటలు రేపుతుంది
అదొక రాచపుండై రాత్రింబవళ్ళు వేధిస్తుంది
అదొక ఆరనిఅగ్నిలా రావణకాష్టంలా రాజుకుంటుంది
రేపటి మీద ఆశను చంపుతుంది బంగారు బ్రతుకులో
చిమ్మచీకటిని నింపుతుంది విషాదాల విందును అందిస్తుంది
ఓ బిడ్డలారా ! ఆలోచించండి అడుగువేయండి
మీ అడుగులు మోహపు"మడుగులో" పడితే
నెత్తిన పిడుగు పడినట్లే, ప్రేమపిచ్చి ముదిరినట్లే
కుటుంబానికి కరెంట్ షాక్ తగిలినట్లే, గుండెలుపగిలినట్లే
అందుకే ఓ బిడ్డలారా !
ఆ నీచకార్యానికి ఒడిగట్టే ముందు...
ఆ రొచ్చులో అడుగుపెట్టే ముందు...
ఆ ఊబిలోకి జారిపోయే ముందు....
ఆ బురదలో కూరుకుపోయేముందు...
ఆలోచించండి బిడ్డలారా ! ఒక్కోసారి ఆలోచించండి !ఆపై
కారుచీకట్లు కమ్మిన మీ జీవితాల్లో ఎన్ని కాంతిరేఖలో !
ఎన్ని ఆశల ఇంద్రధనుస్సులోఎన్ని ఉషోదయపుఉషస్సులో



