Facebook Twitter
ఎక్కడిదీ ?ఎక్కడిదీ ?

ఎక్కడిదీ ?ఎక్కడిదీ ?
మనకు జన్మ ఎక్కడిదీ?
అమ్మానాన్న లేకపోతే
మనకు జన్మ ఎక్కడిదీ?

తాళియే లేకపోతే
ఆలిఅంటు ఎక్కడిదీ?
ఆలియే లేకపోతే
ఆనందం ఎక్కడిదీ?

బందాలే లేకపోతే
బాధ్యతలంటెక్కడివి?
బాధ్యతలే లేకపోతే
హక్కులంటు ఎక్కడివీ?

పాఠమే లేకపోతే
పరీక్షంటు ఎక్కడిదీ?
పరీక్షయే లేకపోతే
ఫలితమంటు ఎక్కడిదీ?

పందెమే లేకపోతే
పతకమంటు ఎక్కడిదీ?
పతకమే లేకపోతె
ప్రశంసలంటెక్కడివీ?

ఆటలే లేకపోతే
పోటీఅంటెక్కడిదీ ?
పోటీనే లేకపోతే
ఓటమంటు ఎక్కడిదీ?

గురువంటూ లేకపోతే
గ్రంధమంటు ఎక్కడిదీ?
గ్రంధమే లేకపోతే
జ్ఞానమంటు ఎక్కడిదీ?

విద్యయే‌ లేకపోతే
వినయమంటు ఎక్కడిదీ?
వినయమే లేకపోతే
విజయమంటు ఎక్కడిదీ?

మేఘమే‌ లేకపోతే
మెరుపంటు ఎక్కడిదీ?
నిప్పన్నది లేకపోతే
మంటంటు ఎక్కడిదీ?

మేఘమే లేకపోతే
వర్షమంటు ఎక్కడిదీ?
వర్షమే‌ లేకపోతే
పంటంటు ఎక్కడిదీ?

విత్తనమే లేకపోతే
మొక్కంటూ ఎక్కడిదీ?
మొక్కయే లేకపోతే
వృక్షమంటు ఎక్కడిదీ?

వస్తువులే లేకపోతే
వంటంటూ ఎక్కడిదీ?
వంటంటూ లేకపోతే
ఆకలెట్లు తీరేదీ?

ఆకలంటు లేకపోతే
ఆశలంటు ఎక్కడివీ?
ఆశలంటు లేకపౌతే
అభివృద్ధి ఎక్కడిదీ?

కోపమంటు లేకపోతే
పాపమంటు ఎక్కడిదీ?
పాపమంటు లేకపోతే
మరణమంటు ఎక్కడిదీ?

ధనమంటూ లేకపోతే
దాత్రృత్వం ఎక్కడిదీ?
దాతృత్వం లేకపోతే
దైవత్వం ఎక్కడిదీ?

కులమంటూ లేకపోతే
కుమ్ములాటలెక్కడివీ?
మతమంటూ లేకపోతే
మారణకాండ ఎక్కడిదీ?

అణచివేత లేకపోతే
విప్లవమంటెక్కడిదీ?
విప్లవమే లేకపోతే
విముక్తి అంటెక్కడిదీ?

ప్రశ్నంటూ లేకపోతే
ప్రతిఘటన ఎక్కడిదీ?
ప్రతిఘటనే లేకపోతే
ప్రగతంటూ ఎక్కడిదీ?

కోవెలే లేకపోతే
భక్తంటు ఎక్కడిదీ?
భక్తంటు లేకపోతే
ముక్తంటూ ఎక్కడిదీ?

ఊహానే లేకపోతే
మహమ్మారి ఎక్కడిదీ?
మహమ్మారె లేకపోతే
మరణఘోష ఎక్కడిదీ?