Facebook Twitter
ఇద్దరూ తల్లులే... కానీ?

కన్నదొకరు
పెంచుకున్నదొకరు
లోపం పెంపకంలో
కాదు రక్తసంబంధంలోనే
ఆ బంధం అర్ధమయ్యేది
పసివయసులో పాలు పట్టేప్పుడు 
పాలు మరిచాక బిడ్డ ఆకలిని తీర్చేప్పుడు

పసివయసులో కన్నతల్లి తన ఎర్రని రక్తాన్ని
తెల్లని పాలుగా‌మార్చి బిడ్డఆకలిని తీరుస్తుంది

ఆకలేసి బిడ్ద ఎన్ని కేకలేసినా పట్టించుకోని
పినతల్లి పాలడబ్బాతో బిడ్డఆకలిని తీరుస్తుంది

కన్నతల్లి తాను తిన్నా తినకున్నా చిరునవ్వుతో
ఎంతో ప్రేమతోఎంతో ఆప్యాయంగా కమ్మని తిండి
కడుపునిండా పెట్టి ఆపై స్కూలుకెళ్ళమంటుంది
ఆకలేస్తే మళ్ళీ తినమని లంచ్ బాక్సు చేతికిస్తుంది

కానీ పినతల్లి కఠినంగా ఖచ్చితంగా కర్కశంగా
చెప్పిన పని చేసి వస్తేనే తిండి పెడతానంటుంది
అది కూడా కడుపునిండా కాదు...సగం సగమే
అదికూడా ఆకలేసినప్పుడు కాదు...అడిగి అడిగి
ఆకలితో గిలగిల కొట్టుకున్నాక ...ఆపై
పెట్టేది కూడా...ప్రేమతో కాదు...తిట్లదండకంతో...
అందుకే అమ్మను దేవతనేది పాదాలకు ప్రణమిల్లేది...
పినతల్లి ఏనాటికైనా పీడించే పిశాచినే సందేహం లేదు...