Facebook Twitter
చీకట్లో చిరుదీపాలు..

కారు చీకట్లు కమ్ముకుంటే

కాస్త కలవరమే‌,కాని

ఎవరూ ఆ చిమ్మచీకటిలో 

చింతిస్తూ కూర్చోరు

చిరుదీపాలు వెలిగించుకుంటారు

చింతలు తొలిగించుకుంటారు

 

కరోనా వచ్చింది 

పుట్టెడు దుఃఖాన్ని తెచ్చింది

నిజమే కాస్త కలవరమే

కాని కరోనా కంటే ముందే 

ఎన్నో అంటువ్యాధులు వచ్చాయి

ఎందరినో మనుషుల్ని కాలగర్భంలో కలిపేశాయి

మందులు కనిపెట్టగానే మటుమాయమై పోయాయి

 

ఇది చరిత్ర చెబుతున్న కఠోర సత్యం

అందుకే భయపడకండి దైర్యంగా వుండండి

భయపడితే ముందు కెళ్ళలేము

ముందున్న  భవిష్యత్తును 

బంగారుమయం చేసుకోవాలంటే

 

ఇప్పుడు మనం మన మనసులనుండి

ఈ కరోనా భూతాన్ని తరిమెయ్యాలి

మాదిగది నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలి

ఆశే శ్వాసగా సంతోషంగా ముందుకు సాగిపోవాలి