శ్వాస మీదనే కరోనా ధ్యాస...
కనిపించని
ఆ కరోనా వన్నీ
జిత్తులే నక్కజిత్తులే...
దాని ధ్యాసంతా
మనిషి శ్వాస మీదనే
అది చిత్తుచిత్తు చేసేది
మనిషి తిత్తులే ఊపిరితిత్తులే.
కాటేయకుండా
ఈ కరోనా కాలనాగును
కట్టడి చేయాలంటే
దాన్ని అథఃపాతాళానికి
అణగద్రొక్కాలంటే
దాన్ని సమాధి చెయ్యాలంటే
వెయ్యక తప్పదు
మనం ఎత్తుకు పైఎత్తులే...
లేదంటే కరోనా వైరస్ సోకిన
వారంతా రాలిపోయే పిట్టలే
ఆరిపోయే వత్తులే కొవ్వొత్తులే...
ఆపై అశృనయనాలతో
నిశ్శబ్దంగా,నివాళుర్పించేది
ఆ పార్థివదేహాలపై వుంచేది
గుత్తులే గులాబీపూలగుత్తులే.....



