భయమే భూతం...ధైర్యమే దీపం...
ఎగిసెగిసిపడే ఆ అలల ప్రయాణమెంతవరకు ?
అలసి సొలసి ఆవలితీరం చేరేంత వరకే
ముసురుకున్న ఈ కారుమబ్బులెంతవరకు?
నింగిలో సూర్యుడు తొంగి చూసేంత వరకే
కమ్ముకున్న ఈ చిమ్మచీకట్లెంతవరకు ?
చీకటిలో చిరుదీపం వెలిగించేంత వరకే
ఈ కరోనా విలయ తాండవమెంతవరకు ?
వ్యాక్సిన్,లేదా మందు కనిపెట్టేంత వరకే
ఔను ఏదీ ఈలోకంలో ఆగదు
ఆగితే అది ముందుకు సాగదు
అందుకే,భయపడకండి
భయమే ఒక భూతం
అది అడుగు ముందుకు వెయ్యనివ్వదు
అభివృద్ధి చెందనివ్వదు, ఆలోచించనివ్వదు
ధైర్యంగా వుండండి
ధైర్యమే మనకు దారిలోదీపం
ఆ వెలుతురులో ఎంతదూరమైనా వెళ్ళవచ్చు
ఏదైనా సాధించవచ్చు,సంతోషంగా వుండవచ్చు



