Facebook Twitter
కరోనా వచ్చింది...కళ్ళు తెరిపించింది

కరోనా వచ్చింది

విషపురుగుల

చరిత్రను తిరగరాసింది

 

కరోనా వచ్చింది

ఇల్లే శ్రీరామ రక్షని

గొప్ప సందేశాన్నిచ్చింది

 

కరోనా వచ్చింది

వలసకార్మికలకు

పుట్టెడు దుఃఖాన్ని తెచ్చింది

 

కరోనా వచ్చింది

కోట్లకన్న ప్రాణం మిన్నంటూ

అందరి కళ్ళు తెరిపించింది

 

కరోనా వచ్చింది

ఉద్యోగం కన్న కుటుంబమేమిన్నంటూ

గొప్ప కనువిప్పు కలిగించింది

 

కరోనా వచ్చింది

అన్ని అనుబంధాలు అశాశ్వతమంటూ

గొప్ప గుణపాఠం నేర్పింది

 

కరోనా వచ్చింది

కరోనా ముందు కరోనా తర్వాతంటూ

కాలాన్ని రెండుగా విభజించింది

 

కరోనా వచ్చింది

పుష్టికరమైన ఆహారం తీసుకోమన్నది

అందరికి ఆరోగ్యామే మహాభాగ్యమన్నది

 

కరోనా వచ్చింది

కాలం అతి విలువైనదని

ప్రాణం వెల కట్టలేనిదని తెలిపింది

 

కరోనా వచ్చింది

మనిషి మనుగడలో, జీవనశైలిలో

చేసేఆలోచనలో, పెనుమార్పులు తెచ్చింది

 

కరోనా వచ్చింది

సామాజిక దూరం కాదు

భౌతిక దూరం పాటించమని ప్రతి మనిషికి నేర్పింది

 

కరోనా వచ్చింది

తన పుట్టుకకు కారణం కనిపెట్టమని 

ఎందరో మేధావులకు, సైంటిస్టులకు సవాలు విసిరింది