Facebook Twitter
కరోనా మళ్ళీ వస్తే..

కుంభవర్షాలు కురిసి

వాగులు వంకలు ఏకమై

వరదలు తుఫాన్లు వస్తే....

 

భయంకరమైన 

భూకంపాలు వస్తే....

 

అగ్నిపర్వతాలు బద్దలైతే....

 

సముద్రాలు ఉప్పొంగి

సునామీలు వస్తే....

 

అణుబాంబులు కురిపించే

ప్రపంచ యుద్దమేవస్తే....

 

జరిగేది అల్లకల్లోలమే 

అపారమైన ఆస్తినష్టమే....

 

ప్రాణనష్టమే ,విధ్వంసమే

వినాశనమే, రక్తపాతమే....

 

కాని,కరోనా వస్తే... కన్ను మూస్తే...

ఆస్తినష్టమూ లేదు...రక్తపాతమూ లేదూ

అంత్యక్రియలకు... పైసా ఖర్చూలేదు ...

 

కోట్లఆస్తి వున్నా అది గడ్డిపోచే...

కోటీశ్వరుడు సైతం  ఓ అనాధే... 

 

కరోనా వస్తే... కన్ను మూస్తే...

కుటుంబ సభ్యులకెవరికీ కడచూపైనా దక్కదంతే 

నిజానికి ఈ కరోనాచావు దిక్కులేని ఓ కుక్కచావే....