Facebook Twitter
ఎక్కడుంది కరోనా? ఏం చేస్తోంది కరోనా?

అదిగో కరోనా,కసితో  

కత్తులు నూరుతోంది,కరోనా

కాలసర్పమై చాటుమాటుగా 

కాటు వేస్తోంది కరోనా

 

చేతికి చిక్కినవారిని  

కాటికీడుస్తోంది కరోనా

మరణమృదంగం 

వినిపిస్తోంది,మందులేని కరోనా

 

ఎక్కడుంది కరోనా ?

ఏం చేస్తోంది కరోనా?

చిందులేస్తూ  శవాలతో 

విందు చేసుకుంటోంది కరోనా

విశ్వమంతా విస్తరిస్తూ

కరాళ నృత్యం చేస్తోంది కరోనా

 

వెక్కిరిస్తూ మనచుట్టే, 

నక్కినక్కి తిరుగుతోంది కరోనా

ఉగ్రరూపం దాల్చి 

అగ్రరాజ్యాలను అల్లాడిస్తోంది కరోనా

 

ఎక్కడుంది కరోనా ?

ఏం చేస్తోంది కరోనా?

అదిగో రాక్షసిలా రాబందులా

రాజ్యమేలుతోంది కరోనా

గుండెలమీద కూర్చొని  

గునపాలు గుచ్చుతోంది కరోనా

 

నిప్పులా కాల్చివేస్తూ

పెనుముప్పులా పొంచివుంది కరోనా

కత్తులు నూరుతూ  

కుత్తుకలు తెగనరుకుతోంది కరోనా

 

ఎక్కడుంది కరోనా ?

ఏం చేస్తోంది కరోనా?

ఎత్తుకు పై ఎత్తు వేస్తూ

ప్రజలను చిత్తుచిత్తు చేస్తోంది కరోనా

విశ్వంపై విరుచుకుపడుతూ

కాలకూటవిషం చిమ్ముతోంది కరోనా

 

సైన్యాధ్యక్షులకు సైతం 

సవాలు విసురుతోంది కరోనా

అణుబాంబులు తననంతంచేయలేవని

అవి ఆరిపోయిన అగ్గిపుల్లలని 

అవహేళన చేస్తోంది కరోనా

 

లెక్కపెట్టలేనన్ని శవాలను 

రాబందులా పీక్కుతింటున్న 

కరోనా రాక్షసి రెక్కల్ని,విరిచెయ్యాలి

ఉగ్రవాదైన కరోనాపై ఉక్కుపాదం మోపాలి

 

ఉక్కు సంకల్పంతో కరోనాను ఉరితియ్యాలి

ఈ మాయదారి మహమ్మా‌‌రి కరోనా 

గుట్టు కనిపెట్టాలి, దాన్ని మట్టు పెట్టాలి

కలిసి అందరం ఈ కరోనా భూతాన్ని ఖతం చెయ్యాలి