భార్యభర్తల
వివాహబంధం ఒక
విచిత్రమైన బంధం ఆ
మూడుముళ్ళ బంధంలో
మొదటి ముడి...మోహం
రెండో ముడి...అవసరం
మూడో ముడి...స్నేహం
స్వచ్చమైన స్నేహంతో
"సమభావన" అంకురిస్తుంది
ఒకరెక్కువ ఒకరు తక్కువన్న
ఆలోచనకు "జననమే" లేదు
స్వచ్ఛమైన ప్రేమను
ఒకరికొకరు పంచుకుంటే
గట్టి నమ్మకంతో
ఒకరినొరొకరు లతలా
అల్లుకుపోతే ఇక
''వంచన" వంతెనలెక్కడ?
కాపురాలు కూలిపోయేందుకు
భార్యభర్తల సంబంధానికి
పటిష్టమైన స్నేహమే పునాదైతే
పడకగదిలో "పవిత్రతకు"
ఇద్దరిమదిలో "ప్రశాంతతకు"
కొదవే వుండదుగా కొంచెమైనా
సంసారం ఒక సాగరం
చిన్నచిన్న పొరపాట్లఅలలు"
అప్పుడప్పుడు ఎగిసిపడతాయి
"నీళ్లల్లో నిప్పును" వెదజల్లుతాయి
చిన్నచిన్న తప్పులే "పెనుఉప్పెనలౌతాయి"
ఒకరికొకరు "ప్రేమతీర్థం" పుచ్చుకుంటే
సహనంతో ఓర్పుతో సర్దుకుపోతుంటే
ఆ దాంపత్యం "సుందర నందనవనమే"
ఆ గృహం ఇలలో ఒక 'భూతలస్వర్గమే"



