Facebook Twitter
ఎవరు గొప్ప? నీవే గొప్ప...

భజనలుచేయ భక్తులే, లేకుంటే
పూజలుచేయ పూజారులే, లేకుంటే
గర్భగుడిలో గాఢాంధకారంలో
శివుడైనా పనికిరాని శిలయే కదా !

పెళ్ళైనా,శోభనం రాత్రి శోభిల్లినా
పెల్లై పదేళ్ళైనా పిల్లల్ని కనకుంటే
గొడ్రాల్లని ముద్రపడిన ఆ తల్లులు 
ఇంటికి పనికిరాని వంట సరుకే కదా!

వినేందుకు విద్యార్దులు, లేకుంటే
భోదించేందుకు బడులే, లేకుంటే
అద్యాపకుల విజ్ఞానమంతా
అడవిన కాసిన వెన్నెలే కదా!

కన్నుమూశాక, కాటికెళ్ళాక
కోరివి పెట్టేందుకు కొడుకే, లేకుంటే
తరతరాలకు తరగని ధనమున్ననేమి?
కోటీశ్వరుడైననేమి ?ఆ తండ్రి గొప్పేమి?

అందుకే, నేడు అందరి కన్న - నీవే గొప్ప
రేపు మాత్రం వేరొకరు గొప్ప - నీవు తప్ప