Facebook Twitter
ఎవరికెరుక ?

ఏ గట్టు మీద
ఏ చెట్టు వుందో?
ఏ చెట్టు మీద
ఏ పిట్ట వుందో?
ఏ చెట్టు క్రింద
ఏ పుట్ట వుందో?
ఏ పుట్టలో
ఏ పాము వుందో?

ఏ బుట్టలో
ఏ పువ్వు వుందో?
ఏ గుట్ట మీద
ఏ గువ్వ వుందో?
ఏ రాయిలో
ఏ రత్నముందో?
ఏ మట్టిలో
ఏ మాణిక్యముందో?

ఏ బుర్రలో
ఏ విజ్ఞానం దాగివుందో?
ఎవరి కెరుక ?
అణ్వేషించే
ఆ అంతరాత్మకు తప్ప

ఏ వ్యక్తిలో
ఏ భక్తి వుందో?
ఏ భక్తికి
ఏ శక్తి వుందో?
ఏ శక్తి
ఏ ముక్తిని ప్రసాధిస్తుందో?
ఎవరి కెరుక ?
ప్రసాధించే
ఆ పరమాత్మకు తప్ప