Facebook Twitter
కార్పొరేట్ కాపురాలు

నేటి మన
కార్పొరేట్ కాపురాలు
ఇలాగున్నాయి
హాయిగా స్వేచ్ఛగా ఎగిరే
పక్షి రెక్కల కాపురాలు

పెరటిలో పచ్చగా పెరిగే
పూలమొక్కల కాపురాలు

పగిలి కలలు చెదిరే
గాజుముక్కల కాపురాలు

ఎంతకకూ అంతుచిక్కని
ఎవరికీ అర్థం కాని
కాకి లెక్కల కాపురాలు

భార్య × భర్త
తరగని కరగని కలతల
కలహాల కన్నీటి కాపురం

భార్య ÷ భర్త
చిక్కుల చికాకుల ఎక్కువ
తక్కువల ఏకాకి జీవితం

భార్య - భర్త
ఒంటరి తుంటరి విధి వంచిత
విడాకుల విషాదకర జీవితం

భార్య + భర్త
వన్నెచిన్నెల వెన్నెల జీవితం
కమ్మని తీయని కలల కాపురం
వెచ్చని పచ్చని సుఖ సంసారం
దైవాశీస్సులు పొందిన దాంపత్యజీవితం