అమ్మతనమే అమ్మకు ఆభరణం...
అమ్మా ఓ అమ్మా ! చెప్పమ్మా ...నీ కన్న మిన్న ఎవరమ్మా !
అమ్మా ఓ అమ్మా ! చెప్పమ్మా ...ఏ దేవత నీకంటే గొప్పమ్మా !
మా అమ్మ ప్రేమమయి మా అమ్మ కరుణామయి
మా అమ్మ అమృతమయి మా అమ్మ అనురాగమయి
మా అమ్మ మా ఇంటికి దీపం మా అమ్మ మా కంటికి వెలుగు
మా అమ్మ మాకు...ఆది గురువు
మా అమ్మ మాకు మార్గదర్శి... కారుచీకటిలో కాంతిరేఖ
మా అమ్మ సహనానికి...ఓర్పుకు చక్కని "చిరునామా"
మా అమ్మ ఆరని ఓ"ఆశాజ్యోతి"...అందరికీఆత్మబంధువు
అమ్మలేని ఏ ఇల్లైనా "దేవుడులేని కోవెలే"...
మా అమ్మ మాట...మధురం
మా అమ్మ ప్రేమ...ఆక్సిజన్
మా అమ్మ మాట...అమృతభాండం
మా అమ్మ ఆలనా పాలనతో... మా జన్మధన్యం
మా అమ్మే ...మాకు దైర్యం... మాఅమ్మే మాకు దైవం
మా అమ్మే మాకు ప్రాణం...మాఅమ్మే మాకు సర్వస్వం
ఓ అమ్మా నీవు లేక మేము...లేము...లేము...లేము
అందుకే అమ్మా ! మీకు వందనం ! పాదాభివందనం !!



