Facebook Twitter
ప్రేమా... ప్రేమా... ప్రేమా...

మనసులో ప్రేమ

పుట్టీ పుట్టగానే

రెండు పెదవుల మధ్య 

ఒక ముద్దై మురిపిస్తుంది 

 

ప్రేమికుల మధ్య 

ఒక బిగికౌగిలై ఊపిరాడక 

ఇద్దరి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది 

 

మసకచీకటిలోనో మల్లెతోట వెనకాలో

పార్కులోనో  పచ్చగడ్డిలోనో

డాబా పై వెచ్చని వెన్నెల్లోనో

పడక గదిలోపూలపాన్పుపైనో 

ఒక సరసమై సంతోషసాగరంలో ముంచుతుంది

 

ఒక శృంగారమై స్వర్గాన్ని రుచిచూపిస్తుంది 

ఒక మత్తై చిత్తుచేస్తుంది 

ఒక మైకమై మరోలోకంలో విహరింపజేస్తుంది 

ఒక కామమై కళ్ళుపొరలు కమ్మి 

కాలనాగై కాటు వేస్తుంది 

 

ఒక జారత్వమై జాతకాలు మారుస్తుంది 

ఒక వ్యభిచారమై సభ్యసమాజానికి

చేటు తెస్తుంది 

 

చరిత్రలో ఒకమాయని

మచ్చగా మిగిలిపోతుంది

మతిలేని భగ్న ప్రేమికులిద్దర్ని 

చరిత్రహీనులుగా మారుస్తుంది

 

అందుకెే  

కళ్ళల్లో కదలాడే ఆ తొలి ప్రేమ 

పెదవుల మధ్య పుట్టే ఆ మలి ప్రేమ 

కౌగిలిలో నలిగే  ఆ పిచ్చి ప్రేమ

కామంతో రగిలే ఆ కసాయి ప్రేమ 

నిజమైన స్వచ్ఛమైన ప్రేమైతే ప్రమాదం లేదు 

 

కాని రోజురోజుకు అది

ఒక అగ్నిజ్వాలగా ఒక అనకొండగా 

ఒక సునామీగా మారితేనెే మహాప్రమాదం 

 

గుండె నిండా స్వచ్చమైన ప్రేమవున్నా

కళ్ళనిండా కసిగా కాటేసే కామముంటే

ఆ ప్రేమ పాలకుండలో జారిన విషపు చుక్కే

తస్మాత్ జాగ్రత్త ఓ ప్రేమపక్షుల్లారా !!!