Facebook Twitter
మీరు ప్రేమ పరీక్ష పాసైతే ?

ప్రేమ పరీక్షలు వ్రాసే

ఓ ప్రేమ పక్షుల్లారా ! 

జరా జాగ్రత్త

మీరు ఈ పరీక్షలు పాసైతే

మీకు పెళ్లవుతుంది

కాని ఫెయిలైతే 

మీ ప్రాణాలే గాలిలో కలిసిపోతాయి

 

ఈ పరీక్షలు మీరు పాసైతే 

స్వర్గం మీ సొంతమౌతుంది 

కాని ఫెయిలైతే 

మీకు మీకుటుంబానికి

అది ఒక నరకమౌతుంది

 

ఈ పరీక్షలు మీరు పాసైతే

ఈ భూమిమీద మీరుండిపోతారు

కాని ఫెయిలైతే 

మీరు మాత్రం హాయిగా శాశ్వతంగా 

ఎటో వెళ్ళిపోతారు  

కానీ ఇక్కడున్న 

మిమ్ము నమ్ముకున్న

మీ అమ్మానాన్నలు మాత్రం 

నరకయాతన అనుభవిస్తారు 

మరచిపోలేని మానసిక క్షోభకు గురౌతారు 

మిమ్ము చేరుకునే వరకు

 

అందుకే ఓ ప్రేమ పక్షుల్లారా ! 

పరీక్షలు కాస్త జాగ్రత్తగా వ్రాయండి

ఫెయిల్ కాకండి ప్రాణాలు తీసుకోండి 

All the best & Good luck