ఓ మిత్రమా!
లక్షలు సంపాదించావు
లక్షాధికారి వయ్యావు
కోట్లు సంపాదించావు
కోటీశ్వరుడివయ్యావు
పెరుగుతున్న
ఈ సంపాదనలో పడి
తిరుగుతున్న నీ
ఆయుస్సును గురించి
ఆలోచించడం మానివేశావు
ఆర్జించిన నీ ఆస్తిని
అనుభవించడం మర్చిపోయావు
మరి
ఇంకెంతకాలం
ఇలా శ్రమిస్తావు?
ఇంకెప్పుడు ఆర్జించిన
నీ ఆస్తిని అనుభవిస్తావు?
పైనుండి పిలుపురాగానే
పరలోకం చేరక తప్పదు కదా
నాడు నీ కష్టార్జితమంతా
పరులపాలే కదా
చీమలు పెట్టిన పుట్టల్లో
పాములు దూరినట్లు
రాత్రింబవళ్లూ రక్తం ధారపోసి
నీవు ఆర్జించిన నీ ఆస్తినంతా
ఆపై అదృష్టవంతులెవరో
హాయిగా అనుభవిస్తారు
ఇందుకేనా నీవంతగా
కడుపుమాడ్చుకొని కష్టపడింది
ఇందుకేనా నీవన్ని
త్యాగాలు చేసి ఇంత ఆస్తినార్జించింది
ఇప్పుడైనా ఇకనైనా
ఒక్కక్షణం ఆలోచించు
అస్తమించే ముందు
ఆర్జించింది నీ ఆస్తిలో
కొంచెమైనా అనుభవించు



