ఈ ఋణం తీరేదెలా?
కష్టపడి కని కలలెవ్నోకని
గడ్డి తిని గంజి తాగి
గొడ్డు చాకిరీచేసి పెంచి,పెద్దచేసి
మంచిసంబందం కోసం
మెప్పుకోసం అప్పులు చేసి
కాళ్ళచెప్పులు అరిగేల తిరిగి
ముప్పుతిప్పలు పడి
మూడుముళ్ళు వేయిస్తే
ముసలి తల్లిదండ్రులకు
ఓ ముద్ద తిండి పెట్టక
కడుపులు మాడ్చేటి
ఓ కసాయివారలారా !
రక్తం పంచుకొని పుట్టిన
ఓ రాక్షసులారా !
గుండు చేయించుకొని
మీరెన్ని గుళ్ళు తిరిగినా
కోటిదేవుళ్ళకు మొక్కినా
మీకు మాత్రం పుణ్యం దక్కదు
కన్నవాళ్ళ కాళ్లు మొక్కనిదే
కన్నవాళ్ళ ఆశిస్సులు పొందనిదే
కన్నవాళ్ళ కన్నీళ్ళు తుడవనిదే
కన్నవాళ్ళ కడుపులు నింపనిదే
కన్నవాళ్ళ రుణం తీరనిదే



