ఆ తల్లి
కనడానికైతే తాను కన్నది కాని
కనేంతవరకు ఆ కడుపులో ఉన్నది
ఆడో మాగో అర్ధంకాక అల్లాడి పోయింది
ఆ తర్వాత
బిడ్డను కనడానికి
తాను తల్లి కావడానికి
తన్మయత్వం చెందడానికి
మాతృత్వపు మాధుర్యాన్ని
రుచి చూడడానికి కారణం
భర్తా లేక భగవంతుడా అర్ధం కాక
మళ్ళీ కుమిలి పోయింది
ఆపై పుట్టిన బిడ్డ
అమ్మా ఆకలి అంటూ సైగలు చేస్తే
ఆ పసికందు ఆకలి తీర్చేదెలా
అని కలవరపడుతూవుంటే
తన ఎఱ్ఱని రక్తాన్ని తెల్లని పాలగా మార్చి
కన్నబిడ్డ కడుపు నింపే శక్తిని
తనకిచ్చిందేవరో అర్ధంకాక
మరోసారి మౌనంగా రోదించింది
కాని అన్నింటికీ కారణం
కనిపించక పోయినా కరుణించే
అఖండ శక్తి స్వరూపుడైన ఆదైవమేనని
ఆ తల్లికి అర్థమైంది
అందుకే ఆపరమాత్మ
పాదాల చెంతకు చేరింది
ఇలా కన్నీటితో ప్రార్ధన చేస్తోంది
ఓ దైవమా!
కడుపు పండి కదలలేకున్నా
కదిలేబిడ్డలోన కాళ్లతో తన్నుతున్నా
బరువైనా భారమైనా సరే
తొమ్మిది నెలలు బిడ్డను భరించాను
నరకయాతన కన్న మిన్నఐన
ప్రసవవేదనను సహించాను
నవమాసాలుమోసి నా రక్తాన్ని పంచి
బిడ్డను కన్నానని నేననుకున్నాను
కాని కడుపులో వున్న పసికందుకు
జీవం పోసి జన్మనిచ్చింది
నాకు కూడా తిరిగి పునర్జన్మ నిచ్చింది
మీరేనన్న నగ్నసత్యం నాకు తెలిసింది
అందుకే ఆమెకు బిడ్డంటే ప్రాణం
భర్తంటే గౌరవం భగవంతుడంటే నమ్మకం
అందుకే ఓ దైవమా ! నాదొక విజ్ఞాపన
నన్ను ఏక్షణమైనా
మీ చెంతకు చేర్చుకోండి కాని
నా బిడ్డకు మాత్రం
నిండునూరేళ్ళఆయుష్షును
ప్రశాంతమైన జీవితాన్ని
ప్రసాదించండి తండ్రీ!
అందుకే అంటారు అనుభవగ్నులు
అమ్మంటే కనిపించే ఒక దేవతని
అమ్మ మాటంటే అమృతమని
అమ్మ ఋణం
ఎన్నిజన్మలెత్తినా తీర్చలేనిదని
నిజానికి
పెళ్లికాక ముందు
ప్రతి ఆడపిల్ల
అందమైన భర్త రావాలని
కమ్మని కలలు కంటుంది
పెళ్లయిన తర్వాత
పండంటి బిడ్డ కలగాలని
కోటిదేవుళ్ళకు మొక్కుకుంటుంది
పిల్లలు పుట్టిన తర్వాత
వారు ప్రయోజకులు కావాలని
మంచి ఉద్యోగం రావాలని
మంచి కోడలు రావాలని
మంచి అల్లుడు రావాలని
వ్రతాలు పూజలు చేస్తుంది
వారికి బిడ్డలు పుట్టిన తర్వాత
అందరికి అడ్డమైన వెట్టిచాకిరి చేస్తుంది
తన బిడ్డలు తమ భార్యాబిడ్డలతో చల్లగా
వుండాలని కోరుకుంటుందే తప్ప తనను
బాగాచూసుకోవాలని కలలు కనదు తనకు
కడుపు నిండా తిండి పెట్టాలని ఏనాడూ కోరుకోదు
కాని తాను నడవలేనప్పుడు
తనకు కళ్ళు కానరానప్పుడు
తన భర్త తనకు తోడుగా లేనప్పుడు
తాను మంచంలో పడినప్పుడు
మాత్రం
కొన్ని మందులు కొనిపెట్టమని కొడుకులను
కోడళ్ళను మనవళ్లను ప్రాదేయపడుతుంది వారి
పాదాలు పట్టుకుంటుంది
ఆసుపత్రికి తీసుకెళ్లమని ఆశతో అర్థిస్తుంది
కన్నీటితో ప్రార్థిస్తుంది అంతే
కాని కాస్తంత కనికరంకూడా లేని ఈ కాలపు
బిడ్డలు బ్రతికినంతకాలం తమ బాగునే కోరుకున్న
కన్నవాళ్ళ చావునే సిగ్గు లజ్జలేకుండగా కోరుకుంటున్నారు
వారు ఆదాయం లేనివారని చులకనగా చూస్తున్నారు వారు
అనారోగ్యానికి గురైతే అసహ్యించుకుంటున్నారు
కన్నవారని కూడా చూడకుండా కాలదన్నుతున్నారు కాటికీడుస్తున్నారు. కలికాలం. మానవత్వంలేని వారు అసలు మనుషులే కాదు వాటికన్నా పశువులు నయం.
కాని రేపు వారికి కూడా ఇట్టి గతే పట్టదని గ్యారంటీ ఏమిటి?



