Facebook Twitter
ఎప్పుడు? ఎప్పుడు? ఎప్పుడు? 

మొరిగే కుక్క 
మొరగడం ఆపుతుంది ఎప్పుడు? 
తిండి పెట్టినప్పుడు
 
పెరిగే మొక్క
ఎదగడం ఆపుతుంది ఎప్పుడు? 
చెదలు పట్టినప్పుడు 

సిగ్గుా లజ్జా లేకుండ
బజారులో పిల్లలు తిరిగేదెప్పుడు? 
బరితెగించి నప్పుడు 
భాద్యత లేనప్పుడు

కుండలా ఒక కొండలా 
బొజ్జ పెరిగేదెప్పుడు? 
వ్యాయామం చెయ్యనప్పుడు
కొవ్వు పేరుకుపోయినప్పుడు

చెరువులకు చేపలు చేరేదెప్పుడు? 
కుంభవర్షాలు కురిసినప్పుడు
చెరువులు బాగా నిండినప్పుడు
 
తల్లిపాలకోసం పాప గుక్కపెట్టి 
వెక్కివెక్కిఏడ్చేదెప్పుడు? 
ఆకలేసినప్పుడు నిద్ర లేచినప్పుడు
 
పిరికిపంద ఆవేశంతో 
రంకెలేసేదెప్పుడు? 
కిందపడినప్పుడు 
నలుగురు నవ్వినప్పుడు 

భార్యమీద భర్త అలిగే దెప్పుడు? 
తెచ్చిన పట్టు చీర కట్టుకోనప్పుడు
ఇచ్చిన మల్లెపూలు పెట్టుకోనప్పుడు

కష్టపడి వ్రాసిన నా కవితకు 
కడుపు నిండేదెప్పుడు? 
చదివి మీరు వెంటనే స్పందించినప్పుడు

ఇష్టపడి పోస్టుచేసిన 
ఈకవిత కలత చెందేెదెప్పుడు? 
కామెంట్లు లైకులు లేకుండా మీరు
సైలెంటుగా వున్నప్పుడు 
సమయమున్నా సరే  
సకాలంలో మీరు స్పందించనప్పుడు