Facebook Twitter
పిల్లలు తిరుగుబోతులైతే? పచ్చి త్రాగుబోతులైతే?

బారు వెలుపల అందరు
బంగారు బాతులే, కానీ 
త్రాగితే మాత్రం కోతులే 
కొండముచ్చులే
చెప్పేవి శ్రీరంగ నీతులే
నోట వచ్చేవి పచ్చి బూతులే
తల్లీదండ్రుల కష్టార్జితంతో
పీకలదాక త్రాగుతారు
త్రాగి తైతక్కలాడుతారు 
కైపెక్కి తాము చాలా 
మంచి వారమంటారు 
తాము ఏ తప్పు చేయడం లేదంటారు
తామే అందరి కంటే తెలివైనవారమంటారు
తప్పుడుమాటలు మాట్లాడుతుంటారు
తప్ప త్రాగొచ్చి
పాలిచ్చిపెంచిన తల్లినే పచ్చి బూతులు తిడతారు
కన్నతల్లీదండ్రులనే కాళ్ళతో తంతారు
కర్రలతో కొడతారు 
కళ్లు రెండు బైర్లుకమ్మి 
ఒళ్ళు మరిచి 
తరతమ భేదం లేకుండా
తప్పుడుపనులుచేస్తారు
తోటి మిత్రులతో కలిసి
తిరుగుతారు తింటారు జోకులేసుకుంటారు
తిట్టుకుంటారు కొట్టుకుంటారు 
జుట్టు పట్టుకుంటారు 
మనసులో ఏదో పెట్టుకుంటారు
తగవులాడుకుంటారు తన్నుకుంటారు 
పాతకక్షలుంటే  
కసాకసా కత్తులతో పొడుచుకుంటారు 
కసితీర్చుకుంటారు 
కటకటాల పాలౌతారు 
కన్నోళ్ళ పరువును గంగలో కలిపేస్తారు
గుండెల్లో గునపాలు గుచ్చేస్తారు
అందుకే  అంటారు విజ్ఞులు
వాడని కిటికీలు పెట్టీ ప్రయోజనం లేదు 
ఉపయోగపడని కొడుకులు పుట్టీ 
ప్రయోజనం లేదు, అని
అందుకే  అంటారు ఇంటిపెద్దలు
పోలియో పిల్లలనైనా భరించవచ్చు కానీ 
పోకిరి పిల్లలను భరించలేము అని
అయ్యో ఓ దైవమా! 
మాకే ఎందుకు ఈ అగ్ని పరీక్ష 
మాకే ఎందుకీ కరగని కన్నీటి శిక్ష