మురికిలో పొర్లే దొర్లే
పంది బ్రతుకు పసందా ?
ఒక్కసారి ఆలోచించు
నీ స్టేటస్ మరచి నీవు నీచంగా ఆలోచిస్తే
మూర్కంగా ప్రవర్తిస్తే ముగ్గురు కాదు
మూడు వేలమంది సిద్ధంగా వుంటారు నీ
ముఖాన ఉమ్మివేయడానికి
అందుకే ఒక్కసారి ఆలోచించు
నీతి తప్పిస జాతితో జత కడితే
నీజన్మధన్యం కాదు శూన్యం
నిజం నిప్పులాంటిది నీతి తప్పకు
సత్యాన్ని సమాధి చేయకు సమాజం ఒప్పుకోదు
బరితెగించి తిరగకు బజారున పడకు
వేషం వేశ్యలావుంటే అందరికీ అసహ్యమే
అందుకే ఒక్కసారి ఆలోచించు
ఆ నీచులు, ఆ ధన పిశాచులు కోరేది
నీ సుఖాన్నినీ శ్రేయస్సును కానేకాదు
నీ మెడలో తాళిని, నీ పర్సులో డబ్బుని
బెడ్ మీదకి నీవు చేరగానే ఒంటిలో వేడి ఆరగానే
రెడ్ లైట్ ఏరియాలో నీ అమ్మకం ఖాయం
అందుకే ఒక్కసారి ఆలోచించు
మన ప్రక్కనే నక్కలా నక్కి నక్కి తిరిగే
నరరూప రాక్షసులంటారు
మన ప్రక్కనే కుక్కలా కక్కినదానికి ఆశపడే
కసాయి వాళ్ళుంటారు
మన ప్రక్కనే చక్కగా చెక్కెరలా మాయమాటలు చెప్పే
మాయగాళ్ళుంటారు
పచ్చిమోసగాళ్ళుంటారు వారిని నమ్మకు
అమ్మ నాన్నల పరువును
అంగటిలో సరుకులా అమ్మకు



