Facebook Twitter
అయ్యో డ్రైవర్ తాతయ్య  ఎంతపని చేశావయ్యా...?

రోజు ఇంటికి రమ్మని
కమ్మని కథలు...కబుర్లు చెప్పే
పక్కింటి తాతయ్యంటే పాపకు ప్రాణం

ఒక రోజు ఎత్తుకొని
"బుగ్గగిల్లితే" త్రుళ్ళి పడింది
"ముద్దాడితే" మురిసిపోయింది
సంతోషంతో గంతులు వేసింది
ఒక రోజు ఇంటికి పిలిచి
"ఒళ్ళో"కూర్చోబెట్టుకొని
"సెల్లో గేమ్స్" ఆడుకోమన్నాడు

ఒక రోజు ఇంటికి రమ్మని
"ప్రక్కలో" పడుకోబెట్టుకొని
సెల్లో "బూతుబొమ్మలు" చూపి
"ఛీఛీ"అంటూ కళ్ళుమూసుకుంటే
ట్యూబ్ లైట్ ఆర్పేసి
చిరునవ్వులు చిందిస్తూ
చీకటిలో ఏవేవో
"చిలిపి పనులు" చేశాడు

ఒక రోజు రాత్రి తాతయ్య
ఫుల్లుగా తాగొచ్చాడు
టీవీ "వాల్యూం" పెంచాడు
"తలుపులు" మూశాడు
"తప్పుడు పని" చేశాడు...

అప్పుడు పాపం పాప
చెరువు గట్టున పడ్డ చేపలా
గిలగిలా గిలగిలా కొట్టుకుంది
టీవీలో "బ్రేకింగ్ న్యూస్"‌...
నమ్మించి మోసం చేసి
కామవాంఛ తీర్చుకున్న
ఓ పక్కింటి ముసలి నక్క...
బలైపోయిన ఓ బాలిక...
అవమానంతో ఆత్మహత్య
చేసుకున్న అమ్మానాన్న....

ఔరా పసిప్రాయం వీడని
ఓ "చిరునవ్వుల చిన్నారి"
ఒక "చిరుదివ్వెలా"ఆరిపోయింది
ఒక "మల్లెపువ్వులా" నలిగిపోయింది
ఓ "ఆడిపాడే అపరంజి బొమ్మ"
బంగారు "భవిష్యత్" బలైపోయింది
ఓ "చిలకపలుకుల రామచిలుక"
"కామాంధుడి కౌగిట్లో బంధీఐపోయింది
నిన్న నిశ్చింతగా "గుట్టుగా" బ్రతికిన
ఓ కుటుంబం"నేడు చెట్టుకు"వ్రేలాడుతోంది
చిన్నారుల్ని చిదిమేసే కళ్ళుపొరలు కమ్మిన కామాంధులకు బహిరంగ ఉరిశిక్షే ఉత్తమశిక్ష
అదే కుప్పకూలిన కుటుంబాలకు శ్రీరామరక్ష