Facebook Twitter
స్వచ్ఛమైన నది....

నదిలో ‌స్వచ్చమైన 

నీరున్నంత వరకే 

నదికి మంచి పేరు

 

నదికి నమస్కారం 

నదిలో మునకలు

నిర్మలంగా నిశ్చలంగా 

పారుతున్న నదిలోనే 

భక్తుల సూర్య నమస్కారం‌ 

 

బురద......నదిలో

నీరులేని...నదిలో

మురికి.....నదిలోమునిగేదెవరు? 

మంచినీరున్న...నదిలోనే 

మూడుమునకలు ‌

నిష్టతో సంధ్యావందనం

 

ఏ నదిలోనైనా ఏ కాలువలోనైనా 

నీరుంటేనే...విగ్రహాల నిమజ్జనం

నీరుంటేనే...పడవ ప్రయాణం

నీరుంటేనే...విహార యాత్రలు 

లాహిరి...లాహిరి...లాహిరిలో... 

ఓహోజగమే ఉగెనుగా తూగెనుగా ఆ...ఆ

అంటూ ఖుషీఖుషీగా కూనిరాగాలుతీస్తూ

హాయి హాయిగా అందరు ఆనందంగా 

విహరించేది...సేదతీరేది...విశ్రాంతిపొందేది

మంచి దారిలేని...ఊరు 

మంచి పేరులేని...మనిషి 

మంచి నీరులేని..."నది" నిరూపయోగమే

అరిషడ్వర్గాలతో రగిలే "మది" అగ్నిగుండమే