పరస్త్రీ వ్యామోహం.....
అందమైనదని
ఆస్తిపాస్తులున్నాయని
ఇష్టపడి మూడుముళ్ళు వేసి
ఎన్నో ఏళ్లుగా
హాయిగా హాయిహాయిగా
కలిసి కాపురం చేయగానే
భార్య మీద
మోజు తగ్గవచ్చు
నిన్నటి బెల్లం
నేడుఅల్లం కావచ్చు
నిన్నటి దేవత
నేడు దెయ్యం కావచ్చు
నిన్నటి తేనెచుక్క
నేడు విషపుచుక్కకావచ్చు
ప్రేమవేడి కాసింత
చల్లారిపోవచ్చు కానీ...
"పరస్త్రీ వ్యామోహం"
పనికిరాదు అది
అత్యంత ప్రమాదకరం
అది మనిషి వ్యక్తిత్వానికే
మాయనిమచ్చ
ఆపై మూడుముళ్లు
మూన్నాళ్ళ ముచ్చటే
ఇరువురు అనుభవించే
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు
ఇక పడినట్లే ఇనుపసంకెళ్లు



