అమ్మానాన్నలే లేకుంటే...?
ఆ సూర్యచంద్రులు
ఆ చుక్కలే లేకుంటే
...ప్రపంచాన వెలుగెక్కడిది?
ఆ దైవమే లేకుంటే
...సుందరమైన ఈ సృష్టి ఎక్కడిది?
ఆ ప్రకృతిలో
ఆ పచ్చని వృక్షాలే లేకుంటే
... మనకు ఈ ప్రాణవాయువెక్కడిది?
ఆ జ్ఞానమేలేకుంటే
...మనకీ సుఖజీవన వేదమెక్కడిది?
అమ్మా నాన్నే లేకుంటే
...అసలు మనకీ మానవజన్మ ఎక్కడిది ?
ఆ బడిలో గురువులే లేకుంటే
వారు విద్యను బోధించకపోతే
...మనకు విజ్ఞానమెక్కడిది ?
...అసలు బ్రతుకులో వెలుగు ఎక్కడిది ?



