బ్రతుకు జట్కాబండి...
ఆకలేసి
గుప్పెడుతిండి
గింజలకోసం
గూడు విడిచి
పక్షులు నీడకోసం
ఎక్కడికెక్కడికో
ఎగిరిపోయినట్లు
దాహం వేసిన
జంతువులు
ఎర్రని ఎండలో
వాగులు వంకలు
చెరువులు చెలిమలు
వెదుకుక్కుంటూ
వెళ్ళిపోయినట్లు
రెక్కలు వచ్చిన పక్షులు
వినువీధిలో విహంగాలై
స్వేచ్ఛగా విహరించినట్టు
వయసొచ్చిన బిడ్డలు
కన్న తల్లిదండ్రులను
భార్యా బిడ్డలకు దూరంగా
ఊరువదిలి ఉన్నతవిద్యకోసం
కొందరు పెద్ధ ఉద్యోగాలకోసం
సుదూరతీరాలకు వెళ్ళిపోతారు
బండలైన బంధాలతో
వేలవేల మైళ్ళదూరాలతో
సహనంతో సర్దుబాటుగుణంతో
రద్దైన రక్తసంబధాలతో రాజీపడడమే
మిణుకు మిణుకుమనే కొండంతఆశతో
భారమైనా బ్రతుకు బండినీ ఈడుస్తూ పోవడమే
చీకటిలో ఏకాంతంగా ఏడుస్తూ ఉండడమే
ముఖాలపై నకిలీ నవ్వుల్ని ముద్రించుకోవడమే
బాధతో బరువెక్కిన గుండెల్ని భరిస్తూ పోవడమే
భారమంతా భగవంతునిపై వేసి భయంతోబ్రతకడమే



