సుఖజీవన వేదం...
కంట్లో చిన్ననలుసు పడితే...
...తట్టుకోవచ్చు...కానీ
కంట్లో కొరివికారమే...పడితే?
ఇంట్లో ఒక పాము దూరితే...
....పట్టుకోవచ్చు...కానీ
వందపాములొక్కసారే...దూరితే?
అగ్నిప్రమాదం జరిగి ఇల్లు కాలిపోతే...
...కట్టుకోవచ్చు...కానీ సమస్య మెడకు
భుకంపమొచ్చి ఇల్లే నేలమట్టమైతే?
ఒక చుట్టుకుంటే...
...తట్టుకోవచ్చు...కానీ
ఒక్కసారే వేయిసమస్యలు
ఎలుగుబంట్లై మీదపడితే?
మందులఖర్చు వందలు వేలైతే...
...భరించవచ్చు...కానీ
మాయదారి రోగమొచ్చి
ఆపరేషన్లకు లక్షలులక్షలు ఖర్చంటే?
ఎలా? ఎలా? తట్టుకోవడమెలా...
ఏది ? ఆదుకునే ఆపన్నహస్తం ఏది ?
అందుకే ఓ మనిషీ ! ఇకనైనా
ఓ పచ్చినిజం తెలుసుకో !
స్వశక్తియే సుఖజీవనవేదమని...
అదే నీ నిత్యనినాదమని...
నమ్మిన నాయకుల్ని...
నయవంచకుల్ని...బ్రతుకే ఒక నరకమని



