Facebook Twitter
వారే ఆపద్బాంధవులు...

అప్పులు పుట్టక 

అవసరాలు తీరక ఆకలి ఆరక 

నిత్యం సవాలక్ష సమస్యలతో

కుమిలిపోతున్న 

కృంగిపోతున్న అనాధలకు 

 

కష్టాలు తీరక కన్నీళ్లు ఆరక 

కళ్ళెదుటే అనేక 

బాధలుపడే అభాగ్యులకు

 

మంచి సలహాలిచ్చి

మంచి మాటలు చెప్పి

మనసులకింత స్వాంతన

చేకూర్చలేకపోయినవారు

ఓదార్చలేకపోయినవారు

 

సమయానికి స్పందించి

ఆపన్నబహస్తం అందించి

కొండంత అండగా వుండి 

ఆదుకోలేకపోయినవారు

ఆదరించలేకపోయినవారు

 

ఆదుకునే మంచి మనసున్న

ఆపద్బాంధవుల ఆచూకి వారి

చిరునామా ఇచ్చినా చాలునే

అదీ ఒక పుణ్యమే కదా

అదీ ఒక మాధవ సేవయేగదా