Facebook Twitter
అందమైన ఆదర్శ కుటుంబం ?

ఇంటినిండా గాదెలనిండా 

ధనరాశులుంటే సరిపోదు 

ఆ గుండెలనిండా

"సుఖశాంతుల" ధనరాశులుండాలి 

 

ఇంటి కుటుంబసభ్యుల 

మధ్య సత్సంబంధాలుంటే సరిపోదు

అందరి గుండెల్లో "అనురాగం

"ప్రేమ ఆత్మీయతలు" వెల్లివిరియాలి

 

పగలు ప్రతీకారాలు లేని స్వచ్ఛమైన 

మానవ సంబంధాలుంటే సరిపోదు

ఆ మనుషులందరు "మానవీయ 

విలువల్ని" మరువకుండా ఉండాలి

 

పదిమందికి ప్రేమను పంచితే సరిపోదు

పేదలకు అనాధలకు విధవలకు 

వికలాంగులకు "దానధర్మాలు" చేయాలి 

 

కలతలు కన్నీళ్లు రాకుండా ఉంటే సరిపోదు

అందరు కలిసిమెలిసి ఆత్మీయంగా ఉండాలి

"మంచితనంతో మానవత్వంతో" జీవించాలి 

 

అప్పుడే ఆ ఆదర్శ కుటుంబంలో 

అంతులేని సుఖశాంతులు...

అందరి జీవితాల్లో వెల్లివిరియును 

దివ్యమైన నవ్యక్రాంతులు...