Facebook Twitter
శ్రీమతి...అంటేనే ! ఒక బహుమతి!

ఏమండోయ్

శ్రీ వారు...

ఏమండోయ్

శ్రీ మతిగారు...

కొన్ని తీపిజ్ఞాపకాలను

తిందామా...

మళ్ళీ ఒక్కసారి

ఆ మధురగీతాలు విందామా...

ఏవిటో అపాత మధురాలు

అవేనోయ్ అప్పుడప్పుడు

మనం ఓకే ఇయర్ ఫోన్ లో

ఈ పాటలు విని

పడుకునేవాళ్ళం,గుర్తుందా

 

"నీమది చల్లగా స్వామి నిదురపో

దేవుని నీడలో, వేదన మరచిపో

నీ మది చల్లగా

ఏ సిరులు ఎందుకో...

ఏ సౌఖ్యములెందుకో...

"ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకు"

"నరకమౌను మనసు తనది కానిదే"

నీమది చల్లగా...

స్వామి నిదురపో దేవుని నీడలో"...

 

"ఎన్నో నోములే గతమందు నోచివుంటా

నీకే భార్యనై ప్రతిజన్మ నందు ఉంటా

"నడిచే దైవమా"?...

నీపాదధూళులే పసుపుకుంకుమలు నాకు"... 

 

అంటూ...వింటూవింటూ అలా

ఆదమరచి నిదురపోయేవాళ్ళం

ఇంతకాలం నాతో ఉన్నందుకు

నన్ను భరించినందుకు...నాతో

కలిసి "జతగాజర్నీ" చేసినందుకు

 

ఓ చిరునవ్వుల శ్రీమతి!...నీప్రేమకిదే నా "అక్షరహారతి!"

ఎందుకంటే ఎవరికైనా..."శ్రీమతి"...అంటేనే

భగవంతుడు ప్రసాదించిన ఒక "బంగారు బమహుమతి!"