Facebook Twitter
చిరునవ్వుతో ఇద్దాం...

చిరకాలం జీవిద్దాం... 

 

పుచ్చుకోవడం తప్ప 

ఇచ్చేగుణం లేనివాణ్ణి 

ఆ పరమేశ్వరుడు సైతం మెచ్చడు 

 

ఇతరులకు ఇవ్వడం తప్ప 

పరులనుండి పుచ్చుకోవడం 

ఎరుగనివాడే పరమాత్మ స్వరూపుడు 

 

పిల్లికి భిక్షంపెట్టని ఓ పిసనారులారా! 

పిడికెడు బియ్యపుగింజలు చల్లినచాలునే

పదిపిట్టల పొట్టలు నిండును గదా !

 

నేడు పేదలకు ఇష్టంతో ఇచ్చువారు, రేపు 

ఆ పరమాత్మనుండి పుష్కలంగా పుచ్చుకుంటారు 

 

ఓ పిసనారులారా ! ఓ పిరికిపందలారా !

కలకాలం బ్రతికి లాభమేమి కాకుల్లాగ !

దాతలుగా...ధన్యజీవులుగా...ఒక్కరోజు  

బ్రతికిన చాలునుగదా హాయిగా హంసల్లాగ !

 

ఊరినుండి చాలానే తీసుకున్నారు

తిరిగి ఇవ్వకపోతే లావెక్కిపోతారు ఇది 

ఓ శ్రీమంతుడు సమాజానికిచ్చిన సందేశం !

 

అలాగే ఈ సమాజంనుండి తీసుకున్న‌వారు 

తిరిగి ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతారు ఇది

ఓ కష్టజీవి అంతరంగ ఆక్రందన ఆవేదన నివేదన ! 

 

రండి రండి ! అనాధల ఆకలి తీరుద్దాం! 

ఆపదలో వున్నవారందరిని ఆదుకుందాం !

చిరునవ్వుతో ఇద్దాం ! చిరకాలం జీవిద్దాం!