అమ్మాయిలూ ! తస్మాత్ జాగ్రత్త !!
బాల్యమంతాం బంగారుమయమే
అయోమయమే అమాయకత్వమే
కోరికలతో రగిలిపోవడమెందుకు ?
కొంపకు చిచ్చు పెట్టడమెందుకు ?
తప్పుడు పనులు చేయడమెందుకు ?
తరువాత కుమిలి పోవడమెందుకు ?
వయసురాగానే పరువం పడగవిప్పగానే
అమ్మానాన్నలను మోసగించడమెందుకు ?
ప్రేమ పిచ్చిపట్టి రెచ్చి పోవడమెందుకు ?
నచ్చినోడితో అర్థరాత్రి లేచి పోవడమెందుకు ?
తెలియక ఒక్కతప్పు చేస్తే సరిదిద్దుకోవచ్చు
కానీ తెలిసి వందతప్పులుచేస్తే సరిదిద్దుకోగలమా?
నాలుగు రోజుల "ఆ సుఖం కోసం ఆరాటపడితే"
"నలబైసంవత్సరాల నరకం" అనుభవించక తప్పదే
నలుగురు నవ్విన నాపచేను నుండునో లేదో కాని
నలబైమంది నవ్విన చాలు బ్రతుకు సర్వనాశనమే
నిన్న మీరు చేసిన ఆ "పాపాలే" రేపు శాపాలైతే
అందరి బ్రతుకులు"నరకకూపాలే"ఆరిపోయేదీపాలే""
ఆపై పగబట్టి కక్షగట్టిన ఆవిధిచేతిలో అందరు కఠినశిక్షలు అనుభవించక తప్పదే కోటి కొరడాదెబ్బలు తినక తప్పదే



