వృద్ధులైన
తల్లిదండ్రులు
కోరేదేమిటి?
పగలు రాత్రి
తపించేది దేనికోసం?
పెద్దరికం కోసమా ? కాదే
ప్రేమపూర్వకమైన పిల్లల
తియ్యనిపిలుపు కోసమేగా...
మాయరోగం ముదిరి
మంచాన పడితే
ఆశతో ఎదురుచూసేది
మనసులో
మధనపడేది దేనికోసం?
పిడికెడు
మెతుకుల కోసమా? కాదే
మరణాన్ని
దూరంచేసే మందులకోసమేగా....
కష్టపడి,శ్రమటోడ్చి
రక్తాన్నిధార బోసి
ఆర్జించిన ఆస్తినంతా
పిల్లలపేర వ్రాసి
దరిద్రులైన వారిని
ధనవంతులను చేసి
వారుమాత్రం నీడలేని
నిరుపేదలౌతున్నారే...
అట్టి తల్లిదండ్రులను
అనాధాశ్రమంలో చేర్చి
ఇంటికి దూరంగా
ఒంటరిగా వుంచకండి !
అస్థిపంజరాలుగా మార్చకండి !
అందుకే ఓ మిత్రులారా !
మీరు కలనైనా మరువకండి !
అనాధాశ్రమాలు
అమ్మా నాన్నలకు..."జైళ్ళని"
అమ్మానాన్నలు లేని
ఇళ్ళన్నీ దేవుళ్ళులేని..."గుళ్ళని"
మీ ప్రతిచర్యను ఖచ్చితంగా
స్కానింగ్ చేస్తాయ్ మీ పిల్లల..."కళ్ళని"
అందుకే ఓ మిత్రులారా !
మీ కన్నీటిచుక్కలు తుడిచిన
మీ అమ్మానాన్నల కళ్ళను
"కన్నీటిసముద్రాలుగా" మార్చకండి !
"గుండెల్లో గునపాలు" గ్రుచ్చకండి
కన్నందుకు వారికి "కడుపుకోత" మిగిల్చకండి !



