లాగులాగు తెగేదాకా వస్తే ఆగు
కంచు మ్రోగినట్టు
కనకంబు మ్రోగదు
ఏమీలేని ఎంగిలి ఇస్తరాకే
ఎగిరెగిరి పడేది
అన్నీ వున్నా అరిటాకు
అణిగి మణిగే వుంటుంది
ఓ మనిషీ ఎగరకు ఎగరకు
ఎంతోఎత్తుకు గాలిపటమల్లే
దారమే తెగితే ఏచెట్టుకొమ్మకో
రెమ్మకో కోతిలా వ్రేలాడక తప్పదు
గిరికీలు కొడుతూ ఎండుటాకులా
క్రిందకు రాలిపోకతప్పదు
ఆధారమే లేకుంటే
ఎవరి బ్రతుకైనా అంధకారమే
గందరగోళమే అథఃపాతాళంలోకే
ఏ పక్షిఐనా ఎంత ఎత్తున ఎగిరినా
చివరికి కిందికి దిగి రాకతప్పదు
చీకటి పడగానే గూటికి చేరకతప్పదు
మూడుముళ్లు పడిన తర్వాత
ఇష్టమున్నా లేకున్నా కాస్త కష్టమైనా
భార్యా భర్తలద్దరు ఒద్దికగా కలిసి మెలిసి
ఉండక తప్పదు కాపురం చేయక తప్పదు
అందుకే ముందుచూపుగల
ఆదర్శదంపతుల "సంసార సందేశం" ఒక్కటే
"లాగు లాగు...తెగేదాకా వస్తే ఆగు"అని



