Facebook Twitter
పరలోకానికా? పాతాళానికా? 

ఓ యువతా !

విను నా చిరుకవిత

దేన్నయితే మనం

అదే పనిగా పదేపదే చూస్తామో 

అది కావాలని ఆశిస్తాం

అది మనదని భ్రమిస్తాం

దక్కకపోతే పిచ్చివాళ్ళమైపోతాం

పరులకు దక్కితే దుఖిస్తాం

అది మనసులో ముద్రపడితే

అది పొందేవరకు నిద్రపోము

 

అలా...దేన్నయితే తెగ

ఇష్టపడతామో దాన్నే అతిగా ప్రేమిస్తాం

దేన్నయితే ప్రేమిస్తామో దాన్నే గౌరవిస్తాం 

దేన్నయితే గౌరవిస్తామో దాన్నే పూజిస్తాం

దేన్నయితే నిత్యం పూజిస్తామో దానికోసం 

ప్రాణాలుసైతం త్యాగంచేయడానికి సంసిద్దం

 

అదే ప్రకృతిధర్మం అదే సృష్టిమర్మం 

అంతా ఆదైవనిర్ణయమే ఆయన అనుగ్రహమే

మనమంతా ఆయన చేతిలో కీలుబొమ్మలమే

 

ఐతే ప్రకృతికి ప్రతికూలంగా 

ప్రవర్తిస్తే పాతాళానికే...(నరకానికే) 

పరమాత్మకు అనుకూలంగా 

జీవిస్తే పరలోకానికే.....(స్వర్గానికే) 

 

మరి నా ఈమంచిమాట వింటారు కదూ... 

కలనైనా మరువకుండా వుంటారు కదూ...