జగడాలమారి జంటలు
చాలు చాలు
ఒక కౌగళింత...
ఓ గిలిగింత...
ఒక పులకింత...
ఓ చక్కిలిగింత...
ఇక ఒళ్ళంతా త్రుళ్ళింతే
ఇల్లంతా
ఇకఇకలూ పకపకలే
పూచేది...
చిరునవ్వుల పువ్వులే
వెలిగేది...
వెన్నెల వెలుగులే
కురిసేది...
ముద్దు మురిపాలే
విరిసేది...
ఇల్లంతా ఇంద్రధనుస్సులే
పండేది...
ప్రేమానురాగాల పంటలే
తొలిగేది...
చింతల చీకాకుల చీకట్లే
ఆరేది...
మండే మనస్పర్దల మంటలే
ఇక మారవలసింది...
మాత్రం జగడాలమారి జంటలే



