Facebook Twitter
ఎక్కడ ప్రశాంతత? అక్కడ?

పెళ్ళై బిడ్డలకు తల్లై

ప్రేమఊబిలో జారిపడితే 

ఎంతటి ప్రమాదం

ఎంతటి మానసిక వేదన

అవమానాలు భరించలేక

అందరూ ఆత్మహత్య అంచుల్లోకే

 

పరువుపోయే...నడివీధిలో 

నవ్వులపాలైపోయే...నలుగురిలో 

వెక్కివెక్కిఏడ్చారు...నక్కినక్కితిరిగారు

నిన్న ఆ ఇల్లుస్వర్గం...నేడొక నరకకూపం 

కుటుంబానికి అది...ఒక తీరనిశాపం

 

బాధలకు వ్యధలకు...దగ్గరగా

బంధువులకు ప్రాణమిత్రులకు 

బహుదూరంగా బ్రతుకునీడుస్తున్నారు

 

నిన్న రాజాలా బ్రతికిన వారి కుటుంబం

మునిగివున్నది నేడు మురికికూపంలో

స్నానమాడుతోంది బుసలుకొట్టే 

సమస్యల సర్పాల సరోవరంలో

దూరింది ముళ్ళకంపలో...

దూకింది అగ్నిగుండంలో...

పాపం ప్రస్తుతం ఆ కుటుంబానికి

కావాలి కాసింత...ప్రశాంతత

కాసింత... పచ్చదనం...

కాసింత...ఆహ్లాదవాతావరణం