Facebook Twitter
భార్య మొండిఘటమైతే...???

భర్తంటే భయం లేక

కాస్తన్నాగౌరవం లేక రోజూ భార్య

చెవిలో జోరీగలా నసపెడుతుంటే

కసురుకుంటూ విసురుకుంటూ

శునకకంటే హీనంగా చూస్తూంటే

 

ప్రత్యక్ష దైవానికే ప్రతినిత్యం

నరకాన్ని చూపిస్తుంటే

పదిమందిలో పరువుతీస్తుంటే

బాధపడలేక పగతీర్చుకునేందుకు

భర్త ఓ "మాస్టర్ ప్లాన్" వేశాడు

 

ఎప్పుడు ఎదురు పడినా

ప్రేమగా పలకరిస్తుందని

పుట్టిన రోజు గిఫ్టుగా

పక్కింటి పంకజానికి

ఓ పట్టుచీర....కొనిపెట్టినట్లు

 

నిత్యం వ్రతాలు పూజలు చేస్తూ

భర్తనే దైవంగా భావించే భాగ్యలక్ష్మికి 

బంగారుగాజు...బహుమతిగా ఇచ్చినట్లు

 

పాపం భర్తలేడంటూ

ముందింటి ముత్యాలుకు

ముత్యాలహారం...చేయించినట్లు

పనిమనిషితో చెప్పించి నమ్మించాడు

 

అంతే పాపమది నిజమని భ్రమపడి

వేడుకుంది భర్త పాదాల మీద పడి 

తన తప్పేంటో తాను తెలుసుకున్నానని

తన లోపాలను తాను సరిదిద్దుకుంటానని

ప్రమాణం చేసింది ఏడుకొండల వెంకన్నమీద

 

ఇప్పుడు ఆమెకి భర్తంటే

ఇంటిలో దీపం...ఒంటిలో ప్రాణం...

కంటిలో చూపు...కనిపించే దైవం

ఇప్పటి ఆమె దినచర్య

ప్రేమతో పలకరింత...కమ్మని కౌగిలింత

నిరంతర నిఘా...ప్రతిరోజు భర్తకుపాదపూజ