ఓ బిడ్డలారా !
నేడు మీ బర్త్ డే కానుకగా
ఖరీదైన బైక్ కొనిచ్చాము
బ్యాంకులో అప్పుచేసి
శాలరీ డిడక్షన్స్ పెట్టి
మీరు కాలేజికి టైంకి వెళ్తారని...
కస్టపడి చక్కగా చదువు కుంటారని...
మంచి ర్యాంకులు తెచ్చుకుంటారని...
ఉన్నతమైన చదువులు చదువుకుంటారని...
రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాము
అప్పులుచేసి కాలేజీ ఫీజులు కడుతున్నాము
మీరు గొప్పగొప్ప ఉద్యోగాలు చేస్తారని...
కమ్మని కలెన్నోకంటున్నాము
మీ బంగారు భవిష్యత్తును గురించి...
కంటిలో నలుసు పడితే కలవరపడిపోతాం...
ఇంటికి క్షేమంగా తిరిగి రావలసిన బిడ్డలు కాస్త
ఆలస్యమైతే కంగారుపడిపోతాం ఆందోళనచెందుతాం
కానీ మీరు అలా అలా గాలిలో తేలిపోతూ
అలాగే గాలిలో కలిసిపోయే ఎలా బిడ్డా?
వచ్చే పుట్టినరోజుకు మీరుండకపోతే ఎలా ?
ఫాస్ట్ డ్రైవింగ్ చేసి డివైడర్ ను డీకొట్టి
కొనవూపిరితో ఆసుపత్రిలో మీరు
కొట్టుమిట్టాడుతూ ఉన్నారని
హఠాత్తుగా ఆకస్మికంగా కాల్ వస్తే
ఏ తల్లిదండ్రులైనా తట్టుకునేదెట్లా బిడ్డా ?
అందుకే ఓ బిడ్డలారా !
ఓ పచ్చినిజాన్ని తెలుసుకోండి...అతివేగం...
అత్యంత ప్రమాదకరమని...ప్రాణాంతకమని...
ఒక్కసారి ఆలోచించండి ! బైక్ ఎక్కేముందు
బాణంలా దూసుకుపోయేముందు, వేగం వెర్రితనం
మీ బంగారు భవిష్యత్తును బలిచేసుకోకండి !
మీ కన్నవాళ్ళ గుండెల్లో గునపాలు గుచ్చకండి !
కమ్మని కలలెన్నోకనే వారి కళ్ళను
కన్నీటి సముద్రాలుగా మార్చకండి !
కలనైనా అలా జరగరాదని
కన్నీళ్ళతో ఆ భగవంతున్ని వేడుకుంటూ...
ఓ బిడ్డలారా ! మీకివే మాపుట్టినరోజు శుభాకాంక్షలు...



