Facebook Twitter
ఎంతటి ఊరట - వ్యాహ్యాళిపేరిట

ఈ ఉషోదయ వేళలో

ఈ చల్లని గాలిలో ఈ పచ్చని ప్రకృతిలో 

మెల్ల మెల్లగా వీచే పిల్ల తెమ్మెరలు 

చల్ల చల్లగా వచ్చి ఒంటిని తాకేవేళ  

గిలిగింతలు పెట్టేవేళ, తనువు

తన్మయత్వంతో పరవశించి పోయేవేళ

 

ఆహా ఎంత హాయి ! ఎంత మనోహరం

ఎంతటి ఆనందం ! ఎంతటి సంతోషం! 

ఎంతటి ఉల్లాసం! ఎంతటి ఉత్సాహం! 

తెలుగులో మాటలేవి తెలియజేయడానికి ?

అది ప్రతివారు తప్పక అనుభవించి తీరాలి 

 

అది అద్భుతం! అమోఘం! 

అతి సుందరం! శుభకరం 

అది అత్యంత ఆనంద భరితం !

కాస్త ఆరు బయటికి వచ్చి అలా ఒక్క గంట

విహరిస్తే చాలు పార్కులో వ్యాహ్యాళి పేరిట !

ఉరుకులపరుగుల జీవితానికి ఎంతో ఊరట!

 

అందుకే పాటించండి చిన్ని చిట్కా!

రాత్రి పూట "పదింటికే పడక" !

ఉదయంపూట "నాలుగింటికి నడక" ! 

వద్దు వద్దు మొద్దునిద్ర వద్దు వద్దు బద్దకం ఇక మీకు

అనారోగ్యం ఆమడదూరం నిండునూరేళ్ళు ఖాయం