Facebook Twitter
ఆనాలుగుపనులు చేసేవారే నాయకులౌతారు!

నిత్యం ఈ నాలుగు పనులు చేయువారు

నలుగురిలో ప్రత్యేకంగా నాయకులై వుంటారు

వారితరులు ఊహించనంత ఎత్తులో వుంటారు

ఉన్నతంగా వుంటారు ఉత్సాహంగా వుంటారు

 

వారే సూర్యోదయం కన్న ముందే నిద్రలేచేవారు

క్రమశిక్షణతో తప్పక యోగా వ్యాయామం చేసేవారు

వేకువనే అభ్యంగనస్నానంచేసి దైవాన్నిఆరాధించేవారు

పద్ధతిగా ఒక ప్రణాళికా ప్రకారం జీవనయాత్ర సాగించేవారు

 

వారు కార్యక్రమాలన్నీ ఒక లక్ష్యంతో ప్రారంభిస్తారు

ఎన్ని అవాంతరాలు వచ్చినా దీక్షతో కొనసాగిస్తారు

ఎన్ని కష్టాలెదురైనా అంతం వరకు పోరాడుతారు

అఖండ విజయాన్ని తమ సొంతం చేసుకుంటారు

 

అట్టి వారికి అందరి ఆశీస్సులు అందుతాయి

ఎందరో చేయూత నిస్తారు పడినా పైకి లేపుతారు

ఆపదలో అందుకుంటారు పైనున్న ఆపరమాత్మ సైతం

ఆ నాలుగు సద్గుణాలే ఏమనిషికైనా పెట్టని ఆభరణాలు