Facebook Twitter
ఆ మాటలు...ఆ చూపులు

"అమ్మ"

స్టౌ ముందు 

గంటల తరబడి

నిలబడి కష్టపడి 

ఇష్టపడి, భ్రమపడి

మెచ్చుకుంటారని

కమ్మని వంటలు చేస్తే 

ఏ వంటా బాగోలేదంటే

అమ్మ కంట కన్నీరే గదా

 

అదే "అమ్మా నీ చేతి వంట"

అమృతం అని అనకపోయినా 

చాలా టేస్టీ గా ఉందమ్మా 

కడుపు నిండిపోయిందమ్మా అని

ఒక్కమాట అంటే చాలు

అమ్మా ఊహల్లో ఊరేగుతుంది

తాఏమీ తినకపోయినా 

అమ్మ కడుపు నిండిపోతుంది 

అమ్మ ముసిముసినవ్వులు 

నవ్వుతుంది మురిసిపోతుంది

తెగ సంబరపడి పోతుంది 

అంతులేని ఆనందంలో  

ఆకాశంలో తేలిపోతుంది 

ఆకలిని మరిచిపోతుంది

 

"అమ్మాయికి"

"పెళ్లి చూపులు"  

ముగిసిన తర్వాత

మీ పిల్ల మాకు నచ్చిందని

వియ్యాల వారినుండి 

"కమ్మనికబురు" వస్తే చాలు 

అమ్మాయి ఉక్కిరిబిక్కిరౌతుంది 

జింకలా చెంగున దూకుతుంది 

ఊహల్లో ఊరేగుతుంది

అమ్మాయి మనసు

ఉయ్యాల జంపాలలూగుతుంది

పరవశంతో పరవళ్ళుతొక్కుతుంది 

కాని, ఏ కబురు రాకపోతే 

ఎదురుచూసి ఎదురుచూసి పాపం

ఏటి చేస్తుందో తెలుసా?

ఏటి లోతు చూస్తుంది

తాను నచ్చలేదని నలుగురిలో

తాను నవ్వులపాలయ్యానని.....

తనకు వివాహం ‌జరగదని

విధి తనను చిన్నచూపు చూస్తుందని....