పరమసత్యం...
ఓ మనిషీ !
ఇలా అన్నీయెరిగి
ఒక అవివేకిలా
ఒక అజ్ఞానిలా బ్రతికి
ఏమిలాభం చెప్పు ?
ఎప్పుడు కలిగేను
నీకు కనువిప్పు?
కాకిలా ఎన్నాళ్ళు
బ్రతికినా కడకు "కాటికే" కదా...
ఏదో...
ఒక క్షణంలో
ఒక విషఘడియలో
ఒక కనురెప్పపాటులో
మరలిరాని లోకాలకు
తరలిపోవడం "తధ్యమే" కదా...
కన్నుమూసి ప్రశాంతంగా
కనుమరుగైపోయే ముందు
"నాది నాది అనుకున్నది
ఏదీ నీది కాదన్న" ఒక
పరమసత్యాన్ని తెలుసుకొని
ఆ పరమాత్మలో
లీనమైపోవుట "ఉత్తమమే" కదా...



